మంగళవారం సాయంత్రం జూబ్లీహిల్స్ పోలింగ్ ముగిసిన తర్వాత స్మార్ట్ పోల్, నాగన్న సర్వే సంస్థలు తమ అంచనాలు వెల్లడించాయి. రెండూ కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతోందని జోస్యం చెప్పాయి.
స్మార్ట్ పోల్ సర్వే: కాంగ్రెస్ పార్టీకి 48.2 శాతం, బీఆర్ఎస్ పార్టీకి 42.1శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది.
నాగన్న సర్వే: కాంగ్రెస్ పార్టీకి 47 శాతం, బీఆర్ఎస్ పార్టీకి 41 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది.
ఆపరేషన్ చాణక్య: కాంగ్రెస్ పార్టీ 48 శాతం ఓట్లు సాధించి విజయం సాధిస్తుందని అంచనా వేసింది.
నిన్న పోలింగ్ సమయం ముగిసే సమయానికి 48.47 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. క్యూలైన్లో ఉన్నవారందరి ఓట్లు కలుపుకున్నా మరో ఒకటి రెండు శాతం మించకపోవచ్చు. కనుక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4 లక్షల మంది ఓటర్లలో కేవలం 2 లక్షల కంటే తక్కువ మందే వచ్చి ఓట్లు వేశారు.
సర్వేల ప్రకారం ఆ 2 లక్షల ఓట్లలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చెరో సగం కంటే తక్కువ పంచుకోగా, మిగిలిన 2-3 శాతం బీజేపి, స్వతంత్ర అభ్యర్ధులకు దక్కుతాయనుకోవచ్చు.