అపర చాణక్యుడినే మట్టి గరిపించిన రేవంత్!

November 08, 2025


img

నేడు తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తదితరులు సిఎం రేవంత్ రెడ్డికి ఫోన్‌ ద్వారా, సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 

ప్రధాని మోడీ కూడా సోషల్ మీడియా ద్వారా సిఎం రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీ, ఇంకా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సిఎం రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టక ముందు పార్టీ పరిస్థితి ఒకలా ఉండేది. ఆ తర్వాత కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటూ అందరినీ కలుపుకుపోతూ ఎదురు లేదని విర్రవీగిన బీఆర్ఎస్‌ పార్టీని మట్టి కరిపించారు. సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వచ్చినప్పటికీ 3 నుంచి 6 నెలల్లోగా కూలిపోతుందని బీఆర్ఎస్‌ పార్టీ పగటి కలలు కంది. కానీ బీఆర్ఎస్‌ పార్టీయే మరింత బలహీనపడగా సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండేళ్ళ పాలన పూర్తి చేసుకొని తిరుగులేదనిపించుకుంది. 

ఇంతకాలం కేసీఆర్‌ ఒక్కరే రాజకీయ వ్యూహాలు పన్నడంలో దిట్ట అనే భావన అందరిలో ఉండేది. కానీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో సిఎం రేవంత్ రెడ్డి తన వ్యూహాలతో బీఆర్ఎస్‌ పార్టీని చావు దెబ్బ తీసి కేసీఆర్‌ కంటే ఘనుడని నిరూపించుకున్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలలో కూడా కాంగ్రెస్‌ పార్టీని గెలిపించుకుంటే సిఎం రేవంత్ రెడ్డికి ఇక తిరుగు ఉండదు.


Related Post