బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజా ఇంటర్వ్యూలో “2023 శాసనసభ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో జిల్లాలలో ఓడిపోయినా హైదరాబాద్‌లో మాత్రం గెలిచింది. ఇప్పుడు సిఎం రేవంత్ రెడ్డి పుణ్యామాని హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మరింత మెరుగుపడింది.
మహాలక్ష్మిలకు ఫ్రీ ప్రయాణం.. ఆ ఛార్జీలు వారి భర్తలు, తండ్రులు, సోదరుల నుంచి వసూలు చేసుకుంటున్నారు. రెండు నెలల క్రితమే విద్యార్ధుల బస్ పాసుల ఛార్జీలు భారీగా పెంచారు. ఇప్పుడు బస్ ఛార్జీలు కూడా భారీగా పెంచేశారు. ఇది ప్రజలను మోసం చేయడం కాదా?
ఈ పధకం వలన ఆదాయం కోల్పోయిన ఆటోరిక్షా డ్రైవర్లను తప్పకుండా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రెండేళ్ళు గడుస్తున్నా వారిని పట్టించుకొనేలేదు.
ఆర్టీసీలో విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టడం వెనుక కూడా పెద్ద కుట్ర ఉంది. టీజీఎస్ ఆర్టీసీని మెల్లమెల్లగా ప్రైవేట్ పరం చేయడం కోసమే ఇలా చేస్తున్నారు. ఒకవేళ ఎలక్ట్రిక్ బస్సులు ఉపయోగించాలనుకుంటే ప్రభుత్వమే కొని ఈయవచ్చు కదా? కనుక సిఎం రేవంత్ రెడ్డి ఏదో రోజు టీజీఎస్ ఆర్టీసీని మూతపెట్టడం ఖాయం,” అని కేటీఆర్ విమర్శించారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్ నగర ప్రజల సమస్యలను పట్టించుకోకుండా వారిని అదనపు ఛార్జీలు, పన్నులయ్తో బాదుతోంది. కనుక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో నగర ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పబోతున్నారు,” అని కేటీఆర్ అన్నారు.