నా ముందూ వెనుకా ఎవరూ లేరు: కవిత

October 01, 2025


img

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వివిద దేశాలలో పర్యటిస్తూ బతుకమ్మ సంబురాలలో పాల్గొంటున్నారు. తెలంగాణ జాగృతి యూకే శాఖ అధ్వర్యంలో లండన్‌లో సోమవారం నిర్వహించిన బతుకమ్మ వేడుకలలో ఆమె పాల్గొన్నారు.

అనంతరం ఆమె వారితో మాట్లాడుతూ, “బీఆర్ఎస్‌ పార్టీ కోసం 20 ఏళ్ళు కష్టపడ్డాను. సొంత పార్టీలోనే అనేక అవమానాలు భరించాల్సి వచ్చింది. కానీ బీఆర్ఎస్‌ పార్టీలో చీలికలు వస్తే తెలంగాణ అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందనే రాష్ట్రం, ప్రజల కోసం అవన్నీ మౌనంగా భరించాను.

 నా వెనుక బీజేపి లేదా కాంగ్రెస్‌ పార్టీ ఉన్నాయని కొందరు పుకార్లు పుట్టిస్తున్నారు. కానీ నా వెనుక ఏ పార్టీ లేదు. మునిగిపోయే పడవ వంటిది కాంగ్రెస్‌. బీజేపి డీఎన్ఏ నాకు అసలు సరిపడదు. కనుక ఆ రెండు పార్టీలలో చేరే ప్రసక్తే లేదు. కొత్త పార్టీ ఏర్పెపాటుపై ఎటువంటి నిర్ట్టేణయమూ తీసుకోలేదు.

ఇప్పటికైతే తెలంగాణ జాగృతితోనే ప్రజా సమస్యలపై పోరాడుతూ, ఈవిదంగా తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రోత్సహిస్తూ ముందుకు సాగాలనుకుంటున్నాను,” అని కల్వకుంట్ల కవిత చెప్పారు.  


Related Post