తెలంగాణలో సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారిణి స్మితా సభర్వాల్‌కు హైకోర్టులో ఉపశమనం లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలకు ఆమె కూడా బాధ్యురాలేనంటూ పీసీ ఘోష్ కమీషన్ నివేదికలో పేర్కొనడంపై ఆమె అభ్యంతరం చెపుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం ఆ నివేదిక ఆధారంగా ఆమెపై ఎటువంటి చర్య తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ కేసుపై సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ వ్రాసింది. కానీ కేసీఆర్, హరీష్ రావు ముందుగానే స్పందిస్తూ పీసీ ఘోష్ కమీషన్ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణకు అనుమతించవద్దంటూ హైకోర్టులో పిటిషన్ వేయగా న్యాయస్థానం వారికి అనుకూలంగా తీర్పు చెప్పింది.
కనుక కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆధారిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీబీఐ చేత విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కానీ కేంద్రం ఇంతవరకు స్పందించలేదు.
కనుక రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ ఈ కేసుని సీఐడీ లేదా సిట్‌కు అప్పగిస్తే కేసీఆర్, హరీష్ రావులతో సహా ఈ కేసుతో సంబంధం ఉన్నవారందరికీ నోటీసులు పంపి విచారణకు పిలిచే అవకాశం ఉంటుంది.