సింగరేణిలో సిఎం ఒక్క దెబ్బకు రెండు పిట్టలు

September 23, 2025


img

సింగరేణి కార్మిక సంఘాలపై పట్టు సాధించాలని ఓ పక్క తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రయత్నిస్తుంటే, మరోపక్క పట్టు కోల్పోకూడదని బీఆర్ఎస్‌ పార్టీ  తమ సీనియర్ నాయకుడు కొప్పుల ఈశ్వర్‌ని రంగంలోకి దించింది.

వారిలో కొప్పుల ఈశ్వర్ సింగరేణి కార్మికులకు ౩౫ శాతం దీపావళి బోనస్ ఇవ్వాలంటూ హడావుడి చేశారు. కానీ సిఎం రేవంత్ రెడ్డి చడీ ఒకే దెబ్బకు ఆ రెండు పిట్టలు కొట్టారు. తాము 35 శాతం అడిగితే ఏ 15-20 శాతమో ఇస్తే, కార్మికులకు అన్యాయం జరిగిందంటూ పోరాటాలు మొదలుపెట్టి అందరినీ తమవైపు తిప్పుకోవచ్చని కొప్పుల ఈశ్వర్ అనుకున్నారు. కానీ 34 శాతం బోనస్ ప్రకటించి ఆయనకు ఆ అవకాశం లేకుండా చేశారు సిఎం రేవంత్ రెడ్డి. 

ఇప్పుడు కవిత రంగంలోకి దిగి సిఎం రేవంత్ రెడ్డి 34 శాతం మాత్రమే ఇవ్వడం వలన ఒక్కో కార్మికుడు సుమారు లక్ష రూపాయల వరకు నష్టపోతారని వాదిస్తున్నారు. సింగరేణి బొగ్గు గనులను ఓ పధకం ప్రకారం మూసేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కానీ 34 శాతం బోనస్ ప్రకటించడంతో సింగరేణి కార్మికులు చాలా సంతోషంగా ఉన్నారు. కనుక ఆమె మాటలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒకే దెబ్బకు రెండు పిట్టలంటే ఇదే కదా?


Related Post