బ్లాక్ లేబిల్, నాటుకోడి కూర అడగను: కడియం

September 21, 2025


img

స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన రాజీనామాపై వస్తున్న ఊహాగానాలపై స్పందిస్తూ, “గత 21 బెలాలుగా నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. నియోజకవర్గం అభివృద్ధి కోసమే పార్టీ మారాను. కనుక అదే పని మీదున్నాను.

ఈ 21 నెలల్లో నేను రూ.1,026 కోట్లు నిధులు సాధించి తెచ్చి నియోజకవర్గంలో అభివృధ్ది పనుల చేశాను. వాటిలో ఏ ఒక్కటి తప్పని నిరూపించినా దానికి నేనే పూర్తి బాధ్యత వహిస్తాను. ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం నియోజకవర్గం అభివృద్ధి కోసమే పనిచేస్తాను. వచ్చే ఎన్నికలలో పోటీ చేయను. ఆ తర్వాత రాజకీయాల నుంచి కూడా శాశ్వితంగా తప్పుకుంటాను,” అని చెప్పారు.    

మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గురించి మాట్లాడబోనని చెపుతూనే, “ఎక్కడికైనా వెళితే బ్లాక్ లేబిల్, నాటుకోడి కూర కావాలని అడగను. పెళ్ళిళ్ళు శుభకార్యాలకు పిలిస్తే మిగిలిన భోజనం టిఫిను బాక్సులో పెట్టుకొని తీసుకుపోను.  పిల్ల చేష్టలు చేయను. వెకిలి మాటలు మాట్లాడను. ఎవరినీ వ్యక్తిగత దూషణలు చేయను,” అంటూ చురకలు వేశారు. 

అంటే కడియం శ్రీహరి తనకు రాజీనామా చేసే ఉద్దేశ్యం లేదని, అవకాశం ఉన్నంత వరకు ఎమ్మెల్యేగా కొనసాగబోతున్నట్లు స్పష్టం చేసినట్లే.

ఆయన ఇప్పటికే తన కుమార్తె కావ్యను ప్రత్యక్ష రాజకీయాలలోకి తెచ్చి వరంగల్‌ ఎంపీగా గెలిపించుకున్నారు. కనుక వచ్చే ఎన్నికలలో ఆమెను స్టేషన్ ఘన్‌పూర్ నుంచి బరిలో దించి తాను తప్పుకోవాలని అనుకుంటున్నట్లు భావించవచ్చు. 


Related Post