కాంగ్రెస్, జాగృతి అభ్యర్ధులు ఖరారు అయితేనే లెక్క తెలుస్తుంది

September 19, 2025


img

బీఆర్ఎస్‌ పార్టీ జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం ఉప ఎన్నికకు కాంగ్రెస్‌, బీజేపిల కంటే ముందుగా బీఆర్ఎస్‌ పార్టీయే తమ అభ్యర్ధిని ఖరారు చేసి ప్రకటించింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పేరుని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ నేడు ఖరారు చేశారు.

ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ ఉప ఎన్నికలో తమ సిట్టింగ్ సీటుని కూడా మళ్ళీ దక్కించుకోలేకపోతే పార్టీ పరువు పోతుంది. కనుక ఈ ఎన్నికలలో పార్టీని గెలిపించుకునేందుకు తన ముందున్న ప్రతీ అవకాశాన్ని కేటీఆర్‌ ఉపయోగించుకోక తప్పదు.

ఆమెకు బదులు వేరే బలమైన అభ్యర్ధిని నిలబెట్టవచ్చు. కానీ సానుభూతి ఓట్లు వదులుకోవలసి ఉంటుంది. అందుకే మాగంటి సునీతని నిలబెట్టి అదనంగా ఆ ఓట్లు కూడా దక్కించుకోవాలని అనుకుంటున్నారు.

కానీ ఎన్నికల వ్యూహాలు రచించి అమలుచేయడంలో కేసీఆర్‌కు ధీటైన వ్యక్తి రేవంత్ రెడ్డి అని శాసనసభ ఎన్నికలలోనే నిరూపించుకున్నారు. ఈ ఉప ఎన్నికలో పోటీ చేయాలని ఉవ్విళ్ళూరిన మహ్మద్ అజారుద్దీన్‌కి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి రేసులో నుంచి తప్పించినప్పుడే రేవంత్ రెడ్డి మనసులో ఏదో పెద్ద వ్యూహం సిద్దంగా ఉందని స్పష్టమవుతోంది.

అలాగే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికతో తన సత్తా నిరూపించుకొబోతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కనుక కాంగ్రెస్‌, తెలంగాణ జాగృతిల అభ్యర్దులను కూడా ప్రకటించిన తర్వాతే జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్‌ పార్టీ పరిస్థితి ఏవిదంగా ఉండబోతోందో స్పష్టమవుతుంది. 


Related Post