బీఆర్ఎస్‌ పార్టీ మౌనం... జవాబు రెండూ ఇబ్బందే!

September 03, 2025


img

కల్వకుంట్ల కవిత నేడు ప్రెస్‌మీట్‌ పెట్టి హరీష్ రావు, సంతోష్ రావులపై చేసిన సంచలన ఆరోపణలపై బీఆర్ఎస్‌ పార్టీ ఇంకా స్పందించలేదు. కానీ మౌనంగా ఉంటే రాజకీయ ప్రత్యర్ధులకు, ముఖ్యంగా ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయి.

పార్టీలో జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలు,అవినీతి గురించి కల్వకుంట్ల కవిత స్వయంగా బయటపెట్టి నందున పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది. ముఖ్యంగా హరీష్ రావుపై చేసిన ఆరోపణలు పార్టీ పునాదులను కదిలించేసే ప్రమాదం ఉంది. కనుక తప్పనిసరిగా ఆమె చేసిన ప్రతీ విమర్శకు, ఆరోపణకు బీఆర్ఎస్‌ పార్టీ జవాబు చెప్పక తప్పదు. 

కానీ ఆమెపై ఎదురుదాడి చేస్తే ప్రజలలో ఆమె పట్ల సానుభూతి, బీఆర్ఎస్‌ పార్టీపై వ్యతిరేకత పెరుగుతుంది. ఏపీలో జగన్‌-షర్మిల మద్య ఇటువంటి పరిస్థితే ఏర్పడినప్పుడు జగన్‌ స్వయంగా, తన వైఎస్సార్ పార్టీ నేతల చేత సొంత మీడియా, సోషల్ మీడియాలో ఆమెపై విమర్శలు గుప్పించారు.

వైసీపీ ఓటమికి అదీ ఓ కారణమే. అప్పటి నుంచి ఆమె ఎన్ని ఆరోపణలు చేస్తున్నా జగన్‌ పట్టించుకోవడం లేదు. కనుక కల్వకుంట్ల కవిత విషయంలో కూడా బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కూడా ఇలాగే సంయమనం పాటించక తప్పదేమో? 

కనుక ఆమెకు దీటుగా జవాబు చెప్పినా చెప్పకపోయినా పార్టీకి ప్రమాదమే. మరి ఏం చేస్తారో చూడాలి.


Related Post