కాళేశ్వరం కేసుని సీబీఐకి అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడంపై తీవ్రంగా స్పందిస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తండ్రి కేసీఆర్‌ని వెనకేసుకువస్తూ మాట్లాడారు. కానీ ఆమె మాటలతోనే ఆయనకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ ఇద్దరూ అవినీతికి పాల్పడ్డారని ఆమె చేసిన ఆరోపణలు పార్టీకి తీరని నష్టం కలిగిస్తాయి. వారి అవినీతి గురించి కేసీఆర్‌కి తెలిసి ఉన్నప్పటికీ వారినే వెనకేసుకువస్తున్నారనే ఆమె ఆరోపణలు, బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత?అనే ఆమె మాటలను కేసీఆర్ తీవ్రంగా పరిగణించవచ్చు. సోమవారం అర్ధరాత్రి వరకు ఫామ్‌హౌసులో పార్టీ ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో ఆమె విషయంపై కూడా చర్చించి ఉండవచ్చు.
ఇంతకాలం ఆమె పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరిస్తున్నా కేసీఆర్ ఆమెను ఉపేక్షిస్తున్నారు. కానీ నిన్న ఆమె మాట్లాడిన మాటలతో ఇక ఉపేక్షించలేని పరిస్థితి కనిపిస్తోంది. కనుక కల్వకుంట్ల కవితపై వేటు వేయక తప్పదేమో?