శాసనసభలో కాంగ్రెస్‌ను ఇలా ఎదుర్కోబోతోంది బీఆర్ఎస్‌!

August 30, 2025


img

ఈరోజు ఉదయం 10.30 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం కాళేశ్వరం కమీషన్ నివేదికని సభలో ప్రవేశపెట్టి ఆ ప్రాజెక్టులో కేసీఆర్‌ అవినీతి గురించి చర్చించబోతోంది.

ఇది బీఆర్ఎస్‌ పార్టీకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఎదుర్కోకతప్పదు లేకుంటే ప్రజలు కాంగ్రెస్‌ ప్రభుత్వం చెప్పిందే నిజమని నమ్మితే బీఆర్ఎస్‌ పార్టీ ఇంకా నష్టపోయే ప్రమాదం ఉంది. కనుక బీఆర్ఎస్‌ నేతలు దీనికి ప్రతివ్యూహం సిద్దం చేసుకొని శాసనసభ సమావేశాలకు హాజరయ్యారు. 

ఆ ప్రతివ్యూహం ఏమిటో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పింది వింటే అర్ధమవుతుంది. “రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో ప్రజలు అల్లాడుతున్నారు. మరోపక్క యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు.

నిరుద్యోగులు నిరుద్యోగభ్రుతి కోసం, జ్యాబ్ క్యాలండర్ కోసం, విద్యార్దినులు కాంగ్రెస్‌ ఇస్తానన్నా స్కూతీల కోసం, రైతులు పంట రుణమాఫీ, రైతు భరోసా  కోసం ఎదురుచూస్తున్నారు. ఇలా రాష్ట్రంలో వివిధ వర్గాలకు చెందిన ప్రజలు నిత్యం మా పార్టీ తలుపు తడుతూనే ఉన్నారు.

శాసనసభ సమావేశాలలో తమ సమస్యల గురించి ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరుతున్నారు. ప్రతిపక్ష పార్టీగా మాకు కూడా ఈ బాధ్యత ఉంది. కనుక తప్పకుండా ఈ హామీల అమలు, ప్రజా సమస్యలపై కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని శాసనసభలో గట్టిగా నిలదీస్తాము,” అని అన్నారు.


Related Post