మా బీహార్‌లో రేవంత్‌ రెడ్డికేం పని?ప్రశాంత్ కిశోర్

August 28, 2025


img

అవును ఈ ప్రశ్న అడిగింది ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిశోరే. ఇదివరకు ఆయన దేశంలో చాలా రాష్ట్రాలలో చాలా పార్టీల కోసం పనిచేశారు.

అన్ని పార్టీల దగ్గరా బారీగా ఫీజులు తీసుకొని వాటి బలాలు, బలహీనతలు, పనిచేసే విధానాలు అన్నీ తెలుసుకున్న తర్వాత తన్న సొంత రాష్ట్రం బీహార్‌లో సొంత కుంపటి (పార్టీ) పెట్టుకున్నారు.

ఈ ఏడాది అక్టోబర్- నవంబర్ నెలల్లో జరుగబోయే శాసనసభ ఎన్నికలలో ఆయన పార్టీ పోటీ చేయబోతోంది. కనుక ఆయన కూడా జోరుగా రాజకీయాలు చేస్తున్నారు. 

ఇటీవల తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు బీహార్‌లో రాహుల్ గాంధీతో కలిసి ‘ఓటర్ అధికార్ యాత్ర’లో పాల్గొన్నారు. దీనిపై ప్రశాంత్ కిశోర్ స్పందిస్తూ, “మా బీహార్‌లో రేవంత్‌ రెడ్డికేం పని?బిహారీలు కూలీ పనులు చేసుకుంటా రంటూ చులకనగా మాట్లాడిన రేవంత్ రెడ్డిని తీసుకువచ్చి రాహుల్ గాంధీ బీహారీలను అవమానించారు,” అని అన్నారు. 

తెలంగాణలో బీఆర్ఎస్‌ పార్టీ ఏవిదంగా ‘తెలంగాణ సెంటిమెంట్’ని తన రాజకీయ ప్రత్యర్ధులపై అస్త్రంగా వాడుతుంటుందో, ప్రశాంత్ కిశోర్ కూడా అదేవిదంగా ‘బిహారీ సెంటిమెంట్’ అస్త్రం వాడుతున్నారన్న మాట! మా బీహార్‌లో రేవంత్‌ రెడ్డికేం పని?అని ప్రశ్నించిన ప్రశాంత్ కిశోర్‌కి ఇతర రాష్ట్రాలలో ఏం పని?అని ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెపుతారు?


Related Post