రాజగోపాల్ రెడ్డిపై వేటు తప్పదా?

August 17, 2025


img

మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి ఇవ్వడం లేదనే బాధతో గత కొన్నిరోజులుగా పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారు. ఇటీవల సిఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

దీనిని కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా పరిగణించింది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఆదివారం సాయంత్రం క్రమశిక్షణ కమిటీ గాంధీ భవన్‌లో సమావేశమైంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఎటువంటి చర్య తీసుకోవాలని చర్చిస్తున్నారు.

ఆయన పార్టీలో చాలా సీనియర్ నేత కనుక పద్ధతి ప్రకారం షోకాజ్ నోటీస్ పంపించి వివరణ కోరాలా? లేదా హద్దులు దాటి పార్టీకి, ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కూడా ఇబ్బందికర పరిస్థితిని సృష్టిస్తున్నందుకు పార్టీ నుంచి బహిస్కరించాలా?అని చర్చిస్తున్నట్లు సమాచారం. మరికొద్ది సేపటికి కమిటీ సమావేశం ముగిస్తే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఎటువంటి చర్య తీసుకోబోతున్నారో స్పష్టమవుతుంది. 

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు మంత్రి కొండ సురేఖ భర్త, ఎమ్మెల్సీ కొండా మురళి కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. కనుక అయనపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా లేదా? అనే విషయం మరికొద్ది సేపటిలో తెలుస్తుంది.  


Related Post