తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు భర్త, కుమారుడితో కలిసి ఎర్రవల్లి ఫామ్‌హౌసుకు చేరుకున్నారు. ఆమె కుమారుడు ఉన్నత చదువులు చదివేందుకు నేడు అమెరికాలో బయలుదేరుతున్నాడు.
కుమారుడిని అక్కడ కాలేజీలో చేర్పించేందుకు కల్వకుంట్ల కవిత కూడా నేడు అతనితో కలిసి అమెరికా బయలుదేరుతున్నారు. ఈ సందర్భంగా ఆమె తన కుమారుడికి కేసీఆర్ ఆశీర్వాదం తీసుకునేందుకు కుటుంబ సమేతంగా వచ్చారు. అక్కడ ఆమెకు గుమ్మడి కాయతో దిష్టి తీసి లోనికి ఆహ్వానించడం విశేషం.
కల్వకుంట్ల కవిత తండ్రికి, పార్టీకి దూరమైనా తర్వాత ఫామ్‌హౌసు వెళ్ళడం ఇది రెండో సారి. ఇదివరకు అయన కాళేశ్వరం కమీషన్ ఎదుట విచారణకు బయలుదేరుతున్నప్పుడు తండ్రిని పరామర్శించడానికి వెళ్ళారు.
కానీ ఆమెపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న కేసీఆర్ కూతురుని పలకరించకుండా వెళ్ళిపోయారు. మరి ఈరోజు గుమ్మడికాయతో దిష్టి తీయించి లోనికి ఆహ్వానించారు. కనుక ఆమెను మళ్ళీ పార్టీలో ఆహ్వానిస్తారేమో చూడాలి.
తన కుమారుడికి కేసీఆర్ ఆశీర్వాదం కోసం మధ్యాహ్నం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు కవిత
తన కుమారుడిని కాలేజీలో చేర్పించేందుకు అమెరికాకు వెళ్లనున్న కల్వకుంట్ల కవిత
15 రోజుల పాటు అమెరికా పర్యటనకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు @RaoKavitha అక్క
pic.twitter.com/RvuHMNaawD