కల్వకుంట్ల కవిత చివరి ఆశ సింగరేణిపైనే?

August 10, 2025


img

బీఆర్ఎస్‌ పార్టీలో నుంచి కల్వకుంట్ల కవిత బయటకు వచ్చేశాక తెలంగాణ రాజకీయాలలో ఏకాకిగా మిగిలిపోయారు. మూడు నెలలు గడిచినా తండ్రి కేసీఆర్‌, అన్న కేటీఆర్‌ పట్టించుకోవడం లేదు. వారి నుంచి పిలుపు రావడం లేదు.

ఈ కారణంగా బీఆర్ఎస్‌ పార్టీలో అందరూ ఆమెకు దూరంగా ఉంటున్నారు. తెలంగాణ జాగృతి కండువా వేసుకొని ఆమె చేస్తున్న రాజకీయాలు ఫలించడం లేదు. పైగా బీఆర్ఎస్‌ పార్టీకి ఇంకా దూరం అవుతున్నారు. ఈ పరిస్థితిలో ఆమె దృష్టి సింగరేణిపై పడినట్లుంది.  

ఈరోజు ఆమె హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “దసరా తర్వాత సింగరేణిలో పర్యటించి వామపక్షాలు, హెచ్ఎంఎస్ (హిందూస్తాన్ మజ్దూర్ సంఘం)తో కలిసి సింగరేణి కార్మికుల సమస్యలపై ప్రభుత్వంతో పోరాడుతాను,” అని చెప్పారు.

ఆమె బీఆర్ఎస్‌ పార్టీకి అనుబందంగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలుగా కాగా ఆ సంఘం నేతలు కూడా ఆమెతో కలిసి పనిచేసేందుకు ఇష్టపడక పోవడంతో వామపక్షాలు, హెచ్ఎంఎస్‌తో కలిసి పని చేసేందుకు కల్వకుంట్ల కవిత సిద్దపడుతున్నారు.

సింగరేణి కార్మిక సంఘాలను ఆకట్టుకోగలిగితే రాజకీయంగా ఆమె బలం పెరిగినట్లే. కానీ ఆమెకు తన భవిష్యత్తు ఏవిదంగా ఉంటుందో తెలీని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆమెను నమ్ముకొని కలిసి ప్రయాణించేందుకు ఎవరు మాత్రం ఇష్టపడతారు?


Related Post