బీఆర్ఎస్ పార్టీ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇటీవల పార్టీ సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయన తెలంగాణ బీజేపి అధ్యక్షుడు రామచందర్ రావుతో భేటీ అయ్యారు. ఈ నెల 11న బీజేపిలో చేరబోతున్నానని తెలియజేశారు.
బీఆర్ఎస్ పార్టీకి గువ్వల రాజీనామా చేయడం ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే. కానీ ఆయన వెంట పార్టీ కార్యకర్తలు బీజేపిలో వెళ్ళేందుకు నిరాకరించారని, బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ నాయకత్వంలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారని తెలిపింది. అవునా కదా? అనే విషయం రాబోయే రోజుల్లో ఎలాగూ తెలుస్తుంది.
ఇప్పటికే కల్వకుంట్ల కవిత వివాదంతో బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటోంది. ఇప్పుడు గువ్వల వంటి వీర విధేయుడు పార్టీని వీడటం పార్టీ గురించి ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుంది. ఒకవేళ ఆయన బీజేపిలో చేరిన తర్వాత ఆ పార్టీకి నమ్మకం కలిగించేందుకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల గురించి ఏవైనా మాట్లాడితే ఇంకా ఇబ్బందికరంగా మారుతుంది.