కేసీఆర్‌ని అరెస్ట్‌ చేయడం రేవంత్ వల్లకాకపోతే....

August 08, 2025


img

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి   ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. 

తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “ఈ ట్యాపింగ్ కేసులో నేను, నా కుటుంబ సభ్యులే మొట్ట మొదటి బాధితులు. మా ఇంట్లో పనివాళ్ళ ఫోన్లు కూడా కేటీఆర్‌ ట్యాపింగ్ చేయించారు. ఈ కేసుకు సంబందించి నా దగ్గర ఉన్న రహస్య సమాచారాన్ని సిట్ అధికారులకు ఇచ్చాను.

కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతిలో ఇన్ని సాక్ష్యాదారాలున్నా కేసీఆర్‌ని అరెస్ట్‌ చేయించే దమ్ము లేదు. అందుకే కేసీఆర్‌పై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈవిదంగా విచారణ, కమీషన్ల పేరుతో కాలక్షేపం చేసేస్తున్నారు.

కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీల మద్య రహస్య అవగాహన ఉంది. లేకుంటే తక్షణం చర్యలు తీసుకోవాలి లేదా ఈ కేసు విచారణ బాధ్యతని సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నాము,” అని బండి సంజయ్‌ అన్నారు.

అయితే ఈ కేసుల నుంచి బయటపడేందుకు కేసీఆర్‌ బీఆర్ఎస్‌ పార్టీని బీజేపిలో విలీనం చేసేందుకు సిద్దపడ్డారని కల్వకుంట్ల కవిత బాంబు పేల్చారు కదా? అంటే కేసుల భయం ఉంటే బీజేపిలో చేరి అభయహస్తం పొందవచ్చన్న మాట!

ఈవిదంగా ఒకరినొకరు వేర్కావేరు కారణాలతో కాపాడుకుంటుంటే ఈ కేసులు, విచారణ, కమీషన్లు... వాటి కోసం వందల కోట్ల ప్రజాధనం ఖర్చు..  అన్నీ వృధాయే కదా?


Related Post