భారత్‌ని శాశించే అధికారం ట్రంప్‌కి ఉందా?

August 07, 2025


img

భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ మరోసారి కన్నెర్ర చేశారు. తాను వద్దని చెపుతున్నా రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేస్తున్నందున అధనంగా మరో 25 శాతం పన్ను విధించారు. గతంలో 10 శాతం ఉన్న పన్నుని ట్రంప్‌ 25 శాతానికి పెంచారు. అది నేటి నుంచి అమలులోకి వస్తుంది.

దీనికి అధనంగా పెంచిన మరో 25 శాతం పను ఈ నెల 27 నుంచి అమలుచేస్తామని ట్రంప్‌ స్పష్టం చేశారు. రష్యా నుంచి చమురు కొంటే ఆ డబ్బుని ఆ దేశం ఉక్రెయిన్‌పై యుద్ధానికి ఉపయోగిస్తోందని ట్రంప్‌ వాదిస్తున్నారు. రష్యా చేస్తున్న దాడులలో వేలాది మంది ఉక్రెయిన్‌ ప్రజలు చనిపోతున్నారని దానికి భారత్ పరోక్షంగా సహకరిస్తోందని ట్రంప్‌ ఆరోపిస్తున్నారు. 

అయితే నేటికీ రష్యా నుంచి అమెరికా యురేనియం తదితర ఖనిజాలను కొనుగోలు చేస్తూనే ఉంది కదా? అని ఓ విలేఖరి ప్రశ్నించగా ఆ విషయం తనకు తెలియదని సమాధానం చెప్పి ట్రంప్‌ తప్పించుకున్నారు.

రష్యా నుంచి చైనా, తుర్కియేలు కూడా చమురు దిగుమతి చేసుకుంటున్నాయి. కానీ వాటిపై ట్రంప్‌ అధనంగా పన్నులు విధించలేదు. చైనాపై 30 శాతం, తుర్కీయేపై 15 శాతం పన్ను విధించారు. ట్రంప్‌ ద్వంద వైఖరికి ఇవి నిదర్శనాలు కావా?

ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడు కావచ్చు గాక. కానీ రష్యా నుంచి చమురు కొనకూడదని భారత్‌కు చెప్పే అధికారం ఆయనకి ఎలా ఉంటుంది? 


Related Post