జాతీయ సీన్‌లో కేసీఆర్ అవుట్… రేవంత్ ఇన్!

August 06, 2025


img

 జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ కింగ్‌మేకర్ అవ్వాలనుకున్నారు. వీలైతే దేశ ప్రధాని కావాలనుకున్నారు. కేసీఆర్‌ పార్టీ పేరు మార్చుకున్నారు కానీ తన ఆలోచనలు మార్చుకోలేదు. అందుకే ప్రధాని కుర్చీలో కూర్చోవాలని ఆశపడిన ఆయన ఏడాదిన్నరగా ఫామ్‌హౌసులో కూర్చోవలసి వచ్చింది. 

కానీ తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీని  ‘బాహుబలి’లా గెలిపించుకున్న సిఎం రేవంత్ రెడ్డి, బీసీ రిజర్వేషన్స్‌ అంశంతో ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నారు. మోడీ, అమిత్ షాల ధాటికి తట్టుకోలేక విలవిలలాడుతున్న కాంగ్రెస్‌ అధిష్టానానికి సిఎం రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్స్‌ అనే బ్రహ్మాస్త్రం అందించారు. 

కనుకనే కాంగ్రెస్‌ అధిష్టానం, ఇండియా కూటమిలో పార్టీల నాయకులు అందరూ నేడు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ధర్నాలో పాల్గొనేందుకు వస్తున్నారని భావించవచ్చు.

బీసీ రిజర్వేషన్స్‌ కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం కాదు. కనుక యావత్ దేశంలో బీసీలు ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీవైపు, ఇంకా చెప్పాలంటే తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డివైపు చూస్తుండవచ్చు. 

కనుక కేసీఆర్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధించలేనిది రేవంత్ రెడ్డి ఒకే ఒక్క ప్రయత్నంతో సాధించగలిగారని చెప్పవచ్చు.


Related Post