మోడీ ప్రభుత్వానికి ఇదే ఆఖరిసారి: రేవంత్ రెడ్డి

August 02, 2025


img

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి డిల్లీలో జరుగుతున్న కాంగ్రెస్‌ వార్షిక న్యాయ సదస్సులో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపికి 150కి మించి సీట్లు రాకుండా చేస్తాము. కాంగ్రెస్‌ పార్టీ ఈ బాధ్యత తీసుకుంటుంది,” అని అన్నారు.

వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్‌ నేతృత్వంలో ఇండియా కూటమి భారీ మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి వస్తుందని సిఎం రేవంత్ రెడ్డి నమ్మకం వ్యక్తం చేశారు. 

2014 ఎన్నికలలో మోడీ నేతృత్వంలో బీజేపి ఘన విజయం సాధించి తొలిసారిగా అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికలలో బీజేపికి ఎంపీల సంఖ్య క్రమంగా తగ్గింది కానీ టీడీపి వంటి కొత్త మిత్రపక్షాలను కలుపుకొని అధికారం నిలబెట్టుకోగలిగింది.

ఇదే సమయంలో కాంగ్రెస్‌ నేతృత్వంలో ఇండియా కూటమి మెల్లగా పుంజుకొని లోక్ సభలో బలం పెంచుకోగలిగింది. కనుక ప్రాంతీయ పార్టీలకు మద్దతు ఇస్తూ అవి రాష్ట్రాలలో నెగ్గేలా చేయగలిగితే బలం పెరుగుతుందని కాంగ్రెస్‌ గ్రహించింది కనుక ఈ ఫార్ములా ప్రకారమే ముందుకు సాగుతోంది.

కానీ బీజేపి కూడా ప్రాంతీయ పార్టీలను కలుపుకుపోతోంది. కనుక వచ్చే ఎన్నికలలో ఇండియా, ఎన్డీయే కూటములు ఎటువంటి వ్యూహాలు అనుసరిస్తాయనే దానిని బట్టే ఫలితాలు ఉంటాయి. 


Related Post