కాళేశ్వరం నివేదిక సిఎం, మంత్రులు చర్చ... ఏం చేయబోతున్నారో?

August 01, 2025


img

జస్టిస్ పీసీ ఘోష్ సుమారు 15 నెలల పాటు కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరిపి 1,000 పేజీలతో కూడిన తుది నివేదికని సుప్రీం కోర్టు జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందివగ్గా ఆయన ఈరోజు సిఎం రేవంత్ రెడ్డిని దానిని అందజేశారు. 

వెంటనే సిఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశమయ్యి ఈ నివేదికపై చర్చించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా మంత్రులు కూడా మొదటి నుంచి వాదిస్తూనే ఉన్నారు. ఇప్పుడు పీసీ ఘోష్ కమీషన్‌ విచారణ జరిపి తయారు చేసి ఇచ్చిన నివేదిక వారి చేతిలో ఉంది.

కనుక దీని ఆధారంగా మాజీ సిఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీష్ రావు తదితరులపై కేసులు నమోదు చేసేందుకు అనుమతిస్తారా లేదా ముందుగా శాసనసభలో చర్చించి అందరి అభిప్రాయలు, ఆమోదం పొందిన తర్వాత తదనుగుణంగా తదుపరి చర్యలకు ఉపక్రమిస్తారా? అనేది త్వరలోనే తెలుస్తుంది. 

ఒకవేళ కేసీఆర్‌, హరీష్ రావులపై కేసులు నమోదు చేస్తే బీఆర్ఎస్‌ పార్టీ ఏవిదంగా స్పందిస్తుందో తేలికగానే ఊహించవచ్చు. ముందుగా ముందస్తు బెయిల్‌ తీసుకొని రాజకీయ, న్యాయ పోరాటాలకు సిద్దం కావచ్చు.


Related Post