భారత్‌పై 25 శాతం సుంకాలు జరిమానా విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించగా భారత్ ప్రభుత్వం చాలా ఆచితూచి స్పందించింది తప్ప ఎదురుదాడికి ప్రయత్నించలేదు. భారత్ ఆర్ధిక వ్యవస్థని ‘డెడ్ ఎకానమీ’ అని ట్రంప్ ఈసడించుకున్నా భారత్ నోరు జారలేదు. కానీ ట్రంప్ ఊహించని విదంగా చాలా పెద్ద షాక్ ఇచ్చింది.
అమెరికా నుంచి అత్యాధునిక, అత్యంత శక్తివంతమైన ఎఫ్-35 యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలనుకున్న భారత్ ఇప్పుడు ఆ ఆలోచన విరమించుకుంటున్నట్లు అమెరికాకి తెలియజేసింది. ఈ ఒప్పందం విలువ ఏకంగా లక్ష కోట్లు అంతకు మించే... ఒక్క రూపాయి కూడా తక్కువ కాదు. ట్రంప్ దుందుడుకుతనం వలన అమెరికాకు ఒక బిలియన్ డాలర్ల వ్యాపారం కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. కనుక ట్రంప్ ఇప్పుడు వెనక్కు తగ్గి ‘చచ్చిన భారత్ ఆర్ధిక వ్యవస్థ’ ఇస్తున్న ఈ లక్ష కోట్ల బిజినెస్ తీసుకుంటారా? మానుకుంటారా?