భారత్ ఆర్ధిక వ్యవస్థ చనిపోయిన వ్యవస్థ (డెడ్ ఎకానమీ) అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సమర్ధించారు.
ధిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “అవును ట్రంప్ నిజమే చెప్పారు. ప్రధాని మోడీ, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇద్దరూ కలిసి దేశ ఆర్ధిక వ్యవస్థని భ్రష్టు పట్టించేయడంతో ఎప్పుడో ‘డెడ్ ఎకానమీ’గా మారిపోయిందనే విషయం దేశంలో ప్రతీ ఒక్కరికీ తెలుసు. ఇప్పుడు ట్రంప్ కూడా అదే చెప్పారు. అందుకు మనం బాధపడి ప్రయోజనం లేదు. సిగ్గుపడాలి,” అని రాహుల్ గాంధీ అన్నారు.
‘ఆపరేషన్ సింధూర్’ తర్వాత యావత్ ప్రపంచదేశాలు భారత్ శక్తి సామర్ధ్యాలను మెచ్చుకుంటుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం పార్లమెంట్ సమావేశాలలో తప్పు పడుతూ వాదించింది. ఎందుకంటే బీజేపి, ప్రధాని మోడీనీ వారు శత్రువులుగా పరిగణిస్తున్నారు కనుకనే!
కానీ ఈవిదంగా పార్లమెంట్‌లోనే భారత్‌ని, భారత్ సైనిక శక్తిని కించపరుచుకోవడం, భారత్‌ని ఉద్దేశ్యించి ట్రంప్ చులకనగా మాట్లాడితే అందుకు రాహుల్ గాంధీ సంతోషపడటాన్ని చూసి నవ్వాలా బాధపడాలా?
అయినా కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించలేక పదవి నుంచి తప్పుకున్న రాహుల్ గాంధీ, దేశాన్ని పాలిస్తున్న ప్రధాని మోడీని, అయన పాలనని కించపరుస్తూ మాట్లాడుతుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది కదా?
దేశ ఆర్ధిక వ్యవస్థ ఇప్పటికే సచ్చిపోయింది
ఈ విషయం ప్రధాని, ఆర్థిక మంత్రికి తప్ప అందరికి తెలుసు, US అధ్యక్షుడు నిజాన్ని చెప్పడం ఆనందంగా ఉంది.
-రాహుల్ గాంధీ pic.twitter.com/79RlmvQmDn