పదేళ్ళ క్రితం పోయిన గొర్రెల కోసం ఇప్పుడు వెతుకులాటా!

July 30, 2025


img

సంతలో గొర్రె పిల్ల తప్పిపోతేనే దొరకడం చాలా కష్టం అలాంటిది పదేళ్ళ క్రితం తప్పిపోయిన గొర్రెల కోసం తెలంగాణ పశు సంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచందర్ నాయక్ ఇంట్లో వెతికితే దొరుకుతాయా? అంటే తప్పక దొరుకుతాయని అంటున్నారు ఈడీ అధికారులు.

నాడు 2015లో కేసీఆర్‌ హయంలో యాదవులు, గొల్ల కురుములకు జీవనోపాధి కల్పించేందుకు ఒక్కో కుటుంబానికి 20 గొర్రెలు చొప్పున కొనుగోలు చేసి ఇచ్చారు. కానీ కొత్తగా గొర్రెలు కనకుండా ఒకసారి కొన్నవాటినే మళ్ళీ మళ్ళీ కొన్నట్లు చూపిస్తూ, పశు సంవర్ధక శాఖ అధికారులు, బీఆర్ఎస్‌ ప్రభుత్వ పెద్దలుసుమారు రూ. 700 కోట్లు అవినీతికి పాల్పడ్డారని ఏసీబీ నిర్ధారించగా, దాని ఆధారంగా ఈడీ కూడా మరో కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టి, ఇప్పుడు రామచందర్ నాయక్ తదితరుల ఇళ్ళ లో సోదాలు జరుపుతోంది.

అవినీతికి పాల్పడినవారు, భవిష్యత్తులో ఏసీబీ, ఈడీ అధికారులు తమపై కేసులు నమోదు చేసి, తమ ఇళ్ళలో సోదాలు నిర్వహించడానికి వస్తే వారు ఆ రికార్డులన్నీ కనుగొనాలని ఇన్నేళ్ళపాటు భద్రంగా దాచిపెట్టి ఉంచుతారా? అంటే కాదనే అర్దమవుతుంది.

ఇన్నేళ్లలో ఎందుకు సోదాలు చేయలేదు? ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు సోదాలు ఎందుకు చేస్తున్నారు? చేసి ఏం సాధించాలనుకుంటున్నట్లు? 


Related Post