నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు....కాలేదు!

July 29, 2025


img

యెమెన్ దేశంలో ఉరిశిక్ష విధించబడిన భారతీయ నర్సు నిమిష ప్రియకు ఉపశమనం లభించింది. భారత్‌ ప్రభుత్వం దౌత్య ప్రయత్నాలు ఫలించడంతో ఆమెకు ఉరిశిక్ష రద్దు చేయాలని యెమెన్ ప్రభుత్వం  నిర్ణయించినట్లు సోమవారం రాత్రి ఓ ప్రకటన వెలువడింది. 

కానీ ఆ వార్తలను భారత్ విదేశాంగ శాఖ ఖండించింది. ఆమెకు ఉరిశిక్ష ఇంకా రద్దు కాలేదని, రద్దు చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది.   

ఆమె ప్రాణాలు కాపాడేందుకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, భారత్‌ గ్రాండ్ ముఫ్తీ మరియు సున్నీ మత గురువు కాంతాపురం ఏపీ అబూబాకర్ ముస్లిమియార్, యెమెన్‌లోని ప్రముఖ సూఫీ మత గురువు షేక్ హబీబ్ ఒమర్ బిన్ హఫీజ్ తదితరులు యెమెన్ ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరిపి మరణశిక్ష రద్దుకు ఒప్పించారని వార్తలు వచ్చాయి.  

కానీ యెమెన్ని మిష ప్రియ చేతిలో హత్యకు గురైన యెమెన్ దేశీయుడి కుటుంబ సభ్యులు కూడా అంగీకరిస్తేనే ఉరిశిక్ష రద్దు అవుతుంది.   

భారతీయ నర్సు నిమిష ప్రియ యెమెన్‌లోని తన వ్యాపార భాగస్వామి పాస్‌పోర్ట్ తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నందుకు అతనిని అతి కిరాతకంగా హత్య చేసి, భారత్‌కు పారిపోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు పట్టుబడింది. యెమెన్ కోర్టు సుదీర్గ విచారణ తర్వాత ఆమెకు ఉరిశిక్ష విధించింది. 

ఈ నెల 16న ఆమెకు ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉండగా భారత్‌ ప్రభుత్వం, కేఏపాల్, అబూబాకర్ ముస్లిమియార్ తదితరుల ప్రయత్నాలు ఫలించి ఉరిశిక్ష వాయిదా పడింది. ఇప్పుడు ఉరిశిక్ష కూడా రద్దు అయిందని వార్తలు రాగా  వాటిని భారత ప్రభుత్వం ఖండించింది. 


Related Post