శనివారం హైదరాబాద్, ఉప్పల్లో మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్‌లో బీఆర్ఎస్ విద్యార్ధి విభాగంతో కేటీఆర్ సమావేశమయ్యారు.
వారినుద్దేశ్యించి మాట్లాడుతూ, “తెలంగాణపై మళ్ళీ ముప్పేట దాడి జరుగుతోంది. ఓ పక్క కాంగ్రెస్, మరో పక్క బీజేపి, ఇంకో పక్క ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు కలిసి తెలంగాణపై దాడి చేస్తున్నారు.
ఈ రాష్ట్రంలో నంబర్: 1 కోవర్టు తెలంగాణా సిఎం రేవంత్ రెడ్డే. అయన చంద్రబాబు నాయుడు కూర్చోమంటే కూర్చుంటారు నిలబడమంటే నిలబడతారు. తెలంగాణ నీళ్ళు ఆంధ్రాకి అప్పగించేస్తున్నారు.
మరో పక్క బీజేపిని అడ్డుపెట్టుకొని చంద్రబాబు నాయుడు మళ్ళీ రాష్ట్రంలో ప్రవేశించాలని ప్రయత్నిస్తున్నారు. కనుక తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి మళ్ళీ ఆనాడు తెలంగాణ ఉద్యమాలు చేసినట్లుగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది.
బనకచర్ల ప్రాజెక్టు వలన తెలంగాణకు నష్టం జరుగుతుందో తెలంగాణ ప్రజలకు వివరించి చైతన్య పరచాలి,” అని కేటీఆర్ కోరారు.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వానికి కాంగ్రెస్, బీజేపి, టీడీపి మూడు పార్టీల వలన ప్రమాదం ఏర్పడిందని గట్టిగా నమ్ముతున్నారు కనుక వాటిని ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ పార్టీ విద్యార్ధుల సాయం కోరుతున్నట్లనిపిస్తోంది.
కానీ బీఆర్ఎస్ పార్టీ బీజేపిలో విలీనం కాబోతోందా లేదో? ముందు తేల్చుకుంటే మంచిది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వయంగా ఈ విషయం బయటపెట్టారు కదా? మళ్ళీ నిన్న (శనివారం) ఏపీ బీజేపి ఎంపీ సిఎం రమేష్ కూడా ఇదే చెప్పారు కదా?
కేటీఆర్ ధిల్లీలో తన ఇంటికి వచ్చి, కల్వకుంట్ల కవితతో సహా తమపై కేసుల విచారణ నిలిపివేయాలని, బీఆర్ఎస్ పార్టీని బీజేపిలో విలీనం చేసేందుకు బీజేపి అధిష్టానాన్ని ఒప్పించాలని బ్రతిమాలుకున్నారని సిఎం రమేష్ సంచలన విషయం బయటపెట్టారు.
కేటీఆర్ విలీనం ప్రతిపాదనతో తన ఇంటికి రావడం నిజమో కాదో చెప్పాలని సవాలు విసిరారు కూడా. ఒకవేళ కాదంటే తన ఇంట్లో సీసీ కెమెరా రికార్డు మీడియాకు విడుదల చేస్తానని చెప్పారు.
ఇటీవల కేటీఆర్ రహస్యంగా ఏపీ మంత్రి నారా లోకేష్‌తో భేటీ అయ్యారని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించినప్పుడు, "అవలేదు. కానీ అయితే తప్నుపేమిటి? నారా లోకేష్ నా తమ్ముడు లాంటివాడు. మా మద్య మంచి స్నేహం ఉందని" కేటీఆర్ స్వయంగా చెప్పుకున్నారు కదా?
ఓ పక్క బీఆర్ఎస్ పార్టీని బీజేపిలో విలీనం చేయాలని ప్రయత్నిస్తూ, మరో పక్క నారా లోకేష్‌తో స్నేహం చేస్తూ బిఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడం కోసం పోరాటాలు చేయాలని కేటీఆర్ విద్యార్ధులను కోరడాన్ని ఏమనుకోవాలి?
తెలంగాణలో చంద్రబాబుకు ఉన్న అతిపెద్ద కోవర్టు ఎవరంటే.. అది రేవంత్ రెడ్డినే.
కాంగ్రెస్, బీజేపీ, చంద్రబాబు.. ఈ ముగ్గురు ఏకమై తెలంగాణ పైన ముప్పేట దాడి చేస్తున్నారు.
తెలంగాణ అస్తిత్వానికి గుర్తింపుగా ఉన్న కేసీఆర్‌ని లేకుండా చేయాలని కుట్రకు పాల్పడుతున్నారు.
- బీఆర్ఎస్ వర్కింగ్… pic.twitter.com/DIFsZ71D3c