తెలంగాణ మంత్రివర్గ సమావేశం వాయిదా

July 25, 2025


img

ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగాల్సి ఉంది. కానీ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఇంకా దిల్లీలోనే ఉన్నందున మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. మళ్ళీ ఈ నెల 28న మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని సిఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. 

స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్స్‌ ఖరారు చేయడానికి హైకోర్టు విధించిన గడువు నేటితో ముగిసిపోతుంది. కానీ ప్రభుత్వం దీని కోసం ఆర్డినెన్స్ జారీ చేసి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకి పంపగా, అయన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ అభిప్రాయం కొరకు పంపారు. కనుక ఈ ఆర్డినెన్స్ వ్యవహారం కూడా ఇప్పట్లో తేలదు. కనుక ఈరోజు మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవాలనుకున్నారు. కానీ మంత్రులు దిల్లీలో ఉండిపోవడంతో సమావేశం వాయిదా పడింది. మరి హైకోర్టుకి ప్రభుత్వం ఏం సమాధానం చెప్పుకుంటుందో?


Related Post