ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత “అన్నయా! మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే” అంటూ ఎక్స్ సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఇదివరకు ఆమె స్వయంగా అన్న ఇంటికి వెళ్ళి శుభాకాంక్షలు తెలిపేవారు. కానీ బీఆర్ఎస్ పార్టీ తీరుపై, తండ్రి కేసీఆర్‌పై విమర్శలు చేసినప్పటి నుంచి పార్టీకి, తండ్రికి, అన్నకు దూరం అయ్యారు కనుక సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాల్సి వచ్చింది. కానీ ఆమెకు కేటీఆర్ బదులివ్వలేదు.
ఆమె ఇటీవల ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా తాను కేసీఆర్ నాయకత్వాన్ని తప్ప మరొకరిని అంగీకరించనని స్పష్టం చేశారు. మరో 10-15 ఏళ్ళ తర్వాత అయినా నేను కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానని కల్వకుంట్ల కవిత చెప్పారు.
ఆమె మాటలు, వైఖరి, చేస్తున్న పోరాటాలు అన్నీ బీఆర్ఎస్ పార్టీకి, అధినేత కేసీఆర్‌కి, కేటీఆర్‌కి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. కనుక నేటికీ కేసీఆర్, కేటీఆర్ ఆమెతో మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు. కానీ తాను రాజకీయాలలో కొనసాగాలనుకున్తున్నాని ఆమె స్పష్టం చేయడమే కాకుండా ఆచరణలో కూడా చూపిస్తున్నారు కనుక రాబోయే రోజుల్లో ఏవిదంగా ముందుకు సాగుతారో?
<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Annayya <br>Many Happy Returns of the day!! <a href="https://twitter.com/KTRBRS?ref_src=twsrc%5Etfw">@KTRBRS</a></p>— Kavitha Kalvakuntla (@RaoKavitha) <a href="https://twitter.com/RaoKavitha/status/1948230132642238536?ref_src=twsrc%5Etfw">July 24, 2025</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>