చంద్రబాబు-రేవంత్ ఢిల్లీలో సమావేశం

July 16, 2025


img

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి ఈరోజు ఢిల్లీలో శ్రమశక్తి భవన్‌లో కేంద్ర జలశక్తి మంత్రి హెచ్ ఆర్‌ పాటిల్ సమక్షంలో సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, తెలంగాణ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి, ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, జలవనరుల శాఖల కార్యదర్శులు, ఇంజనీర్లు పాల్గొంటున్నారు. 

మళ్ళీ చాలా కాలం తర్వాత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అవుతుండటం, అదీ.. ఢిల్లీలో కేంద్ర మంత్రి హెచ్ ఆర్‌ పాటిల్ సమక్షంలో సమావేశంఅవుతుండటం చాలా శుభ పరిణామమే. ప్రస్తుతం హాట్ టాపిక్ ఏపీ ప్రభుత్వం చేపట్టబోతున్న బనకచర్ల ప్రాజెక్టు.. దీనిపై ఈసమావేశంలో చర్చ వద్దని తెలంగాణ ప్రభుత్వం ముందే చెప్పింది కనుక అది మినహాయించి కృష్ణా, గోదావరి జలాల పంపకాలు, వాటిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల గురించి చర్చలు జరుగుతాయి. 

తెలంగాణలో పార్టీల రాజకీయాలు, రాజకీయ అవసరాలు, రాజకీయ కారణాల వలన ఇంతకాలం నీటి సమస్యలు అపరిష్కృతంగా ఉండిపోయాయి. ఇది రెండు రాష్ట్రాలకు మేలు చేయదు. కనుక ఈ సమావేశంలో ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకొని, రాజకీయ ఒత్తిళ్ళని తట్టుకుంటూ వాటిని తెలంగాణ ప్రభుత్వం అమలుచేయగలిగితే రైతులకు ఎంతో మేలు కలుగుతుంది  



Related Post