కాంగ్రెస్, బీజేపిలు బద్ద శత్రువులనే విషయం అందరికీ తెలిసిందే. కనుక బీజేపి నేతలు సోనియా, రాహుల్ గాంధీలపై విమర్శలు గుప్పిస్తుంటే, రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై విమర్శలు వ్యంగ్యాస్త్రాలు గుప్పిస్తుంటారు. కనుక రాష్ట్ర స్థాయిలో కూడా ఆ పార్టీలు అదేవిదంగా పరస్పరం విమర్శించుకుంటుంటాయి. కాంగ్రెస్ అధిష్టానంపై ఏపీ బీజేపి ఓ అద్భుతమైన వ్యంగ్యసత్రం సందించింది.
రోబో సినిమాలో రజనీకాంత్ తనను పోలి ఉండే చిట్టీ అనే రోబోని తయారుచేసినట్లుగా కాంగ్రెస్ అధిష్టానం కూడా పార్టీలో నాయకులను తయారుచేసుకోకుండా తమ కనుసన్నలలో పనిచేసే రోబోల వంటి నేతలను తయారు చేస్తోందంటూ ‘రోబో’ సినిమాలో ఓ సన్నివేశం, పార్లమెంటులో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మాట్లాడిన మాటల వీడియోలని ఎక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాని గురించి వివరించడం కంటే చూస్తేనే బాగుంటుంది.