నేవీలో కూడా మహిళా ఫైటర్ పైలట్లు

July 05, 2025


img

భారత్‌ వాయుసేనలో ఇప్పటికే పలువురు మహిళలు ఫైటర్ పైలట్లుగా యుద్ధ విమానాలు నడుపుతున్నారు. ఇప్పుడు భారత్‌ నావికా దళంలో కూడా మహిళలు ఫైటర్ పైలట్లు కాబోతున్నారు. భారత్‌ నావికాదళంలో సబ్ లెఫ్టినెంట్ ఆస్తా పూనియా యుద్ధ విమానాలు నడిపేందుకు ఎంపికయ్యారు. నావికా దళంలో మొట్టమొదటి మహిళా ఫైటర్ పైలట్ కాబోతున్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆర్‌ అడ్మిన్ జనక్ బెవిల్ (ఏసీఎన్ఎస్ ఎయిర్) నుంచి ప్రతిష్టాత్మకమైన ‘వింగ్స్ ఆఫ్ గోల్డ్’ బ్యాడ్జ్ అందుకున్నారు. సబ్ లెఫ్టినెంట్ ఆస్తా పూనియాకు యుద్ధ విమానాలు నడిపేందుకు నిర్వహించిన ప్రాధమిక పరీక్షలన్నీటిలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఈ  ‘వింగ్స్ ఆఫ్ గోల్డ్’ బ్యాడ్జ్ ఇస్తారు. ఇక నుంచి ఆమె యుద్ధ విమానాలు నడపడంలో శిక్షణ పొందబోతున్నారు. భారత్‌ నావికాదళం చరిత్రలో ఇదో కొత్త అధ్యాయమని ఎక్స్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 


Related Post