అఖండ-2లో బాలీవుడ్‌ బాలనటి

July 02, 2025


img

సల్మాన్ ఖాన్ హీరోగా 2015లో విడుదలైన ‘భజరంగీ భాయ్ జాన్' ఓ సూపర్ డూపర్ హిట్. ఆ సినిమాలో వినికిడి లోపం ఉన్న బాల నటిగా నటించిన హర్షాలీ మల్హోత్రా ఇప్పుడు బోయపాటి-బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కిస్తున్న     అఖండ-2తో టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. ఆమెకి అఖండ-2లోకి స్వాగతం పలుకుతూ ఆమె ఫోటో ఎక్స్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సినిమాలో ఆమె పాత్ర పేరు జనని అని కూడా తెలియజేశారు.  

ముంబయికి చెందిన హర్షాలీ మల్హోత్రా మొదట బాల నటిగా పలు హిందీ టీవీ సీరియల్స్‌లో నటించి మెప్పించింది. ‘భజరంగీ భాయ్ జాన్' ఒక్క సినిమాతో ఆమె పేరు బాలివుడ్‌లో మారుమ్రోగిపోయింది. కానీ ఆ తర్వాత ఆమె చదువుల కోసం సినిమాలకు దూరంగా ఉండిపోయి, పదేళ్ళ తర్వాత ఇప్పుడు అఖండ-2తో టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. 

అఖండ-2లో ఆది పినిశెట్టి, సంయుక్త, ప్రగ్యా జైస్వాల్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు స్క్రీన్ ప్లే: కె. చక్రవర్తి రెడ్డి, డైలాగ్స్: భాను, నందు, సంగీతం: తమన్, కెమెరా: విజయ్‌ కార్తీక్ కణ్ణన్, ఎడిటింగ్: నిరంజన్ దేవరమనే చేస్తున్నారు.   

సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకార స్టూడియోస్ బ్యానర్లపై గోపీ అచంట, రామ్ అచంట, బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్వి కలిసి రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న అఖండ-2 సెప్టెంబర్ 25న విడుదల కాబోతోంది. 



Related Post