భారత్‌కు చమురు కష్టాలు తప్పవా?

June 22, 2025


img

ఇరాన్‌ మీద అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాలు దాడులు చేస్తుండటంతో ఇరాన్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలో పలుదేశాలకు చమురు, ఇతర సరుకు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జల సంధి (మార్గాన్ని) మూసివేయాలని నిర్ణయించింది. 

హర్మూజ్ జల సంధి ఏంటి, ఎక్కడుంది? ఒమన్ దేశానికి చెందిన ముసాండం  ద్వీపకల్పానికి-ఇరాన్‌కు మద్య ఓ అరేబియా సముద్రంలో ఓ సన్నటి సముద్ర మార్గమే ఇది. సౌదీ అరేబియా, ఇరాన్‌, కువైట్, యూఏఈ, ఇరాక్ దేశాల నుంచి ప్రపంచ దేశాలకు రవాణా అయ్యే చమురులో 20 శాతం ఈ ఇరుకైన జలసంధి గుండానే జరుగుతుంది. ఎల్ఎన్‌జీ (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) కూడా ఈ జల సంధి గుండానే జరుగుతుంది.

భారత్‌ చమురు దిగుమతులలో 40 శాతం ఈ హర్మూజ్ జల సంధి ద్వారానే జరుగుతుంది. ఇప్పుడు ఇరాన్‌ దీనిని మూసివేస్తే అమెరికా, రష్యా నుంచి దిగుమతి చేసుకోవలసి ఉంటుంది. దీని వలన చమురు, గ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. వీటి దిగుమతులపై ఎక్కువ సొమ్ము ఖర్చు చేయవలసివస్తే రూపాయి విలువ ఇంకా తగ్గుతుంది. వీటన్నిటి కారణంగా నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు పెరుగుతాయి. 


Related Post