నెలరోజుల క్రితం వరకు బిఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల కవితని అందరూ ఓ యువరాణిలా గౌరవించేవారు. ఆ కారణంగా ఆమె ఇంట్లో నుంచి కాలు బయటపెడితే పార్టీ ముఖ్య నేతలు, వందలాది మంది బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆమె వెంట ఉండేవారు.
కానీ ఎప్పుడైతే ఆమె తిరుగుబాటు చేశారో అప్పటి నుంచి ఆమెను తండ్రి కేసీఆర్‌తో సహా పార్టీలో ఎవరూ పట్టించుకోవడం లేదు. కనుక ఇప్పుడు ఆమె తెలంగాణ రాజకీయాలలో ఇదివరకు వైఎస్ షర్మిల ఏవిదంగా ఒంటరిగా మిగిలిపోయారో ఆదేవిదంగా మిగిలిపోయారు.
సిమ్ కార్డు మొబైల్ ఫోన్లో పెడితేనే పనిచేస్తుంది లేకుంటే అదో చిన్న ప్లాస్టిక్ ముక్కగా మిగిలిపోతుంది. ‘తెలంగాణ జాగృతి’ పరిస్థితి కూడా అలాగే మారింది. ఆమె బిఆర్ఎస్ పార్టీలో ఉన్నంత కాలం అదో బలమైన శక్తిలా కనిపించేది.
కానీ బిఆర్ఎస్ పార్టీకి దూరమైన తర్వాత ఆ సిమ్ కార్డు (తెలంగాణ జాగృతి) కూడా ఆశించినంతగా పనిచేయడం లేదు. కనుక తండ్రితో రాజీకి సిద్దపడ్డారు కానీ కేసీఆర్ పట్టించుకోలేదు. కనుక బిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా.
కనుక కల్వకుంట్ల కవిత ముందు ఇప్పుడు ఒకే ఒక ఆప్షన్ ఉంది. అదే.. అన్న కేటీఆర్‌ని ఏదోవిదంగా ప్రసన్నం చేసుకొని ఆయన ద్వారా తండ్రిని ఒప్పించి బిఆర్ఎస్ పార్టీలోకి తిరిగివెళ్ళిపోవడం. బహుశః అందుకేనేమో ఎఫ్-1 రేసింగ్ కేసులో కేటీఆర్‌కి మద్దతుగా మాట్లాడుతున్నారు. మరి కేటీఆర్ అయినా చెల్లిని కనికరిస్తారో లేదో?