పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో నగదు రహిత లావాదేవీలను కేంద్ర ప్రభుత్వం చాలా ప్రోత్సహించింది. ఆ కారణంగా ఇప్పుడు లక్షల కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. ప్రభుత్వం చిన్న నోట్లు ముద్రణ తగ్గించిందో ఏమో ఇప్పుడు రూ. 10,20,50,100 నోట్లకు చాలా కొరత ఉంది. ఈ కారణంగా రూ.5,10,20లకు కూడా అందరూ యూపీఐ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు.
దీనినే మరో విదంగా చెప్పుకోవాలంటే, చిన్న నోట్లు అందుబాటులో లేకుండా చేసి అందరూ విదిగా యూపీఐ పేమెంట్స్ వాడేలా చేస్తోందనుకోవచ్చు. ఈ కారణంగా ఇప్పుడు బిచ్చగాళ్ళు సైతం క్యూఆర్ కోడ్ మెయింటెయిన్ చేస్తున్నారు.
నగదు రహిత లావాదేవీల వలన ప్రతీ రూపాయి ఎక్కడి నుంచి ఎటు వెళుతోందో కేంద్రానికి, ఆదాయపన్ను శాఖకి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తెలుస్తుంది, కనుక ఇది ప్రజలకు, ప్రభుత్వానికి కూడా చాలా సౌలభ్యంగా ఉన్న చక్కటి విధానమే.
అయితే ఇప్పుడు దేశ ప్రజలు యూపీఐ లావాదేవీలకు ఇంతగా అలవాటు పడిన తర్వాత, వాటిపై ఛార్జీలు వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. డిజిటల్ లావాదేవీల నిర్వహణ ఖర్చులు పేరుగుతున్నందున, తమకు నష్టం వస్తోందని బ్యాంకులు, చెల్లింపుల సేవా సంస్థలు కేంద్రంపై ఒత్తిడి చేస్తుండటంతో రూ.3,000 కి మించి లావదేవీలపై కొంత రూము వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఆ వార్తల సారాంశం.
సామాన్య ప్రజలపై ఈ ఛార్జీల భారం ఉండబోదని చెపుతున్నప్పటికీ తర్వాత జరుగబోయేది ఖచ్చితంగా అదే!