కేసీఆర్ తెలంగాణ సాధించి, రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేసి చూపినా ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది? బిఆర్ఎస్ పార్టీని, డాని అధినేత కేసీఆర్‌ని ప్రజలు ఎందుకు తిరస్కరించారు? అంటే కేవలం అహంభావం భరించలేకనే!
కానీ నేటికీ కేటీఆర్ ధోరణిలో ఎటువంటి మార్పు రాలేదని ఈరోజూ ఆయన సిఎం రేవంత్ రెడ్డిని, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి అన్న మాటలు వింటే అర్దమవుతుంది.
కాళేశ్వరం కేసులో జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ ఎదుట కేసీఆర్ ఇవాళ్ళ విచారణకు హాజరయ్యారు. ఆయనకు నోటీస్ ఇచ్చి విచారణకు రప్పించడం నేరమన్నట్లు కేటీఆర్ మాట్లాడారు. పైగా సిఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అతనో చిల్లరగాడు. ఆ చిల్లర గాడికి మరో వంద జన్మలు ఎత్తినా కేసీఆర్ గొప్పతనం అర్దం కాదు.
రేవంత్ రెడ్డి గురువు, ఆయన జేజమ్మతో గొడవపడి ఇక్కడి నుండి తరిమేసిన వాడు కేసీఆర్. కనుక ఈ చిల్లరగాడు కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేడు,” అని కేటీఆర్ అన్నారు.
కేసీఆర్ ఏడాదిన్నరగా ఫామ్‌హౌస్‌లో ఉండటానికి కారణం ఆ చిల్లరగాడే కదా? తెలంగాణలో తమకు తిరుగే లేదని విర్రవీగిన కేసీఆర్, కేటీఆర్‌లను ఎన్నికలలో ఓడించి మూల కూర్చేబెట్టిన ఘనడు ఎవరు? రేవంత్ రెడ్డే కదా? ఎన్నికలలో టీడీపీ పోటీ చేయకుండా తప్పు కోవడం వల్లనే కాంగ్రెస్ చేతిలో బిఆర్ఎస్ పార్టీ ఓడింది కదా?రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మూడు లేదా ఆరు నెలల్లో పడగడతామని కేటీఆర్, హరీష్ రావులు ప్రగల్భాలు పలికారు. కానీ 18 నెలలు గడిచినా ఏమీ పీకలేకపోయారు కదా?
ఆ ఓటమిని దానికి కారణం అయినవారిని ‘చిల్లర గాళ్ళు’ అంటూ కేటీఆర్ చులకనగా మాట్లాడటం ఆయన అహంకారాన్ని సూచిస్తున్నాయి. కేటీఆర్ ఈ అహంకారం వదులుకోకపోతే అదే బిఆర్ఎస్ పార్టీ పతనానికి దారి తీస్తుంది.
100 జన్మలు ఎత్తినా రేవంత్ రెడ్డి అనే చిల్లర గాడికి కేసీఆర్ గొప్పతనం అర్థం కాదు
— Telugu Scribe (@TeluguScribe) June 11, 2025
రేవంత్ రెడ్డి గురువు, ఆయన జేజమ్మతో గొడవ పడి ఇక్కడ నుండి తరిమిన వాడే కేసీఆర్
రేవంత్ రెడ్డి అనే చిల్లరగాడు ఏం చేసినా కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేడు- కేటీఆర్ pic.twitter.com/8oB4bRgoVB