కాళేశ్వరం కేసులో జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ ఎదుట కేసీఆర్ నేడు విచారణకు హాజరవగా 50 నిమిషాల్లోనే ఆయన బయటకు వచ్చేశారు. ఈ కేసులో కేసీఆర్‌ని 115వ సాక్షిగా పేర్కొన్నప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టుకి కర్త, కర్మ, క్రియ అన్నీ కేసీఆరే అయినప్పుడు, 50 నిమిషాలలోనే ప్రశ్నించి పంపించేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
విచారణ ముగిసిన తర్వాత కేసీఆర్ బయట తన కోసం ఎదురుచూస్తున్న మీడియాతో ఏమీ మాట్లాడకుండానే బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అభివాదం చేసి వెళ్ళిపోయారు. కనుక కమీషన్ ఆయనని ఏమేమి అడిగిందో ఆయన ఏం సమాధానాలు చెప్పారో తెలియలేదు. బహుశః నేడో రేపో బిఆర్ఎస్ పార్టీ నేతలలోనే ఎవరో ఒకరు ఈ విచారణపై మీడియాకు వివరించే అవకాశం ఉంది.
కేసీఆర్ విచారణకు బయలుదేరే ముందు ఆయనని పరామర్శించేందుకు కల్వకుంట్ల కవిత భర్తతో కలిసి ఫామ్‌హౌస్‌కు వచ్చారు. కానీ ఆమె తండ్రి చుట్టూ దెయ్యాలు తిరుగుతున్నాయని, బిఆర్ఎస్ పార్టీని బీజేపిలో చేసేయాలని ప్రయత్నించారంటూ బహిరంగంగా విమర్శలు చేసినందున, కేసీఆర్ ఆమెను పలకరించలేదు.