బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీలో కేటీఆర్, హరీష్ రావులతో విభేదించి తిరుగుబాటు ప్రకటించి తెలంగాణ జాగృతిని యాక్టివ్ చేసుకొని చాలా హడావుడి చేస్తున్నారు. తన తండ్రి కేసీఆర్‌కి జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ నోటీస్ ఇవ్వడాన్ని నిరసిస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్కులో బుధవారం నిరసన దీక్ష చేశారు.
ఈ సందర్భంగా ఆమె “పోలీస్ గీలీస్ నైజాన్తా.. నోటీస్ గీటిస్ నైజాన్తా..” అంటూ నినాదాలు చేశారు. ఆమె ప్రాస కోసం ఆవిదంగా నినాదాలు చేసినప్పటికీ పోలీసులను కించపరిచేవిదంగా ఉన్నాయిఆమె తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాన్ని లేదా కమీషన్ నిర్ణయాన్ని తప్పు పడుతూ నిరసన చేయదలిస్తే వారిని విమర్శించాలి. కానీ తమ నిరసన దీక్షకు భద్రత కల్పిస్తున్న పోలీసులను కించపరిచే విదంగా ‘పోలీస్ గీలీస్ నైజాన్తా’ అంటూ నినాదాలు చేయడం సబబు కాదు.
అయినా ఆమె తండ్రి కేసీఆర్‌కి నోటీసులు ఇవ్వడం తప్పు పడుతూ చేసిన దీక్షకు బిఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఒక్కరూ కూడా రాలేదంటే ఆమె దీక్షకు కేసీఆర్ ఆమోదం లేనట్లే కదా?
కల్వకుంట్ల కవిత పార్టీ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఆమె తండ్రి కేసీఆర్ పిలిచి మందలించలేదు. కనీసం ఆమె తండ్రిని కలిసేందుకు ప్రయత్నించలేదు.
ఈవిదంగా ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉంటూ తండ్రి కోసం ధర్నాలు చేయడం దేనికి? పోలీసులను కించపరచడం దేనికి?
పోలీస్ గీలీస్ నహీ జాన్తా..,పోలీస్ గీలీస్ నహీ జాన్తా
నోటీస్ గీటీస్ నహీ జాన్తా ..,నోటీస్ గేటీస్ నహీ జాన్తా
కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చినందుకు ధర్నా చేస్తున్న సమయంలో కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్న పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన @RaoKavitha గారు.., pic.twitter.com/zNlhbnBUJ4