కవితక్కా ఏమిటీ గందరగోళం?

May 31, 2025


img

బిఆర్ఎస్ పార్టీ నేతలను, కార్యకర్తలను ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చాలా గందరగోళ పరుస్తున్నారు. బిఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడానికే నా తాపత్రయం అంటూనే కేసీఆర్‌ విధానాలను విమర్శిస్తున్నారు. పార్టీని బీజేపిలో విలీనం చేయాలని కేసీఆర్‌ ఆలోచిస్తున్నారనే విషయం బయటపెట్టి పెద్ద బాంబు పేల్చారు. పార్టీని వీడను, కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదంటూనే మరో పక్క ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ‘తెలంగాణ జాగృతి’ని యాక్టివ్‌ చేస్తున్నారు.  

కేసీఆర్‌ తీరుని తప్పు పడుతూనే కాళేశ్వరం కేసులో తండ్రికి జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్‌ నోటీస్ ఇవ్వడాన్ని నిరసిస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జూన్ 4 వ తేదీన హైదరాబాద్‌, ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయబోతున్నారు.

కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావు ముగ్గురూ ఆమె చేస్తున్న విమర్శలు, ఆరోపణలు, అడుగుతున్న ప్రశ్నల కు సమాధానాలు చెప్పకుండా మౌనం వహిస్తున్నందున బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఆమెతో కలసి ధర్నాలో పాల్గొనాలా వద్దా?అసలు ఆమెతో ఏవిదంగా వ్యవహరించాలి? అని తికమక పడుతున్నారు. కనుక ఇప్పటికైనా బిఆర్ఎస్ పార్టీ తరపున స్పష్టత ఇస్తే బాగుంటుంది. లేకుంటే పార్టీకి ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది.


Related Post