సింగరేణి జాగృతి.. సొంత కుంపటి ప్రయత్నాలేనా?

May 28, 2025


img

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం ‘సింగరేణి జాగృతి’ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం ఆమె నివాసంలో జరిగిన ఈ కార్యమానికి సింగరేణి సంస్థ పరిధిలోని 11 ఏరియాలలోని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టిబిజికెఎస్) నేతలు హాజరయ్యారు.

ఇక నుంచి ‘సింగరేణి జాగృతి’ ‘టిబిజికెఎస్’ కలిసి సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి పనిచేస్తాయని కల్వకుంట్ల కవిత చెప్పారు. సింగరేణిలో 11 ఏరియాలకు ‘సింగరేణి జాగృతి’ సమన్వయ కర్తలను నియమించారు. త్వరలోనే ‘సింగరేణి జాగృతి’ మహిళా విభాగం కూడా ఏర్పాటు చేస్తామని కల్వకుంట్ల కవిత చెప్పారు. 

నేటికీ ఆమె బిఆర్ఎస్ పార్టీలోనే ఎమ్మెల్సీగా ఉన్నారు. సింగరేణిలో బిఆర్ఎస్ పార్టీ అనుబంధంగా పనిచేసే టిబిజికెఎస్ ఉంది. అటువంటప్పుడు ఆమె మళ్ళీ ‘సింగరేణి జాగృతి’ని ఏర్పాటు చేయడం చూస్తే, ఆమె సొంతంగా పార్టీ పెట్టుకునే ఆలోచనలో ఉన్నట్లు భావించవచ్చు. ఈవిదంగా బిఆర్ఎస్ పార్టీ క్యాడర్‌ని ఆకర్షించి తన పార్టీని నిర్మించుకోవాలని ఆమె ఆలోచనగా కనిపిస్తోంది. 

కనుక ఆమెను బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినా లేదా ఆమె పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చినా జరుగబోయేది ఇదే అని భావించవచ్చు. 


Related Post