కవిత ఆ లేఖ వ్రాసి లీక్ చేశారేమో? డికె అరుణ

May 23, 2025


img

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రికి పార్టీ రజతోత్సవ సభ గురించి వ్రాసిన లేఖ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో వైరల్ అవుతోంది. 

ఆ సభలో ప్రసంగించిన కేసీఆర్‌ బీజేపిని విమర్శించకుండా మెతకవైఖరి ప్రదర్శించడాన్ని ఆమె తప్పు పడుతూ బీజేపితో పొత్తుకి బిఆర్ఎస్ పార్టీ ఆరాటపడుతోందని ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపినట్లయిందని కల్వకుంట్ల కవిత ఆ లేఖలో అభిప్రాయం వ్యక్తం చేశారు. 

ఆమె బీజేపి ప్రస్తావన తెచ్చారు కనుక తెలంగాణ బీజేపి సీనియర్ నాయకురాలు, ఎంపీ డికె అరుణ తనదైన శైలిలో స్పందించారు. ఆమె ఏమన్నారో క్లుప్తంగా.. 

• కేసీఆర్‌ని నేరుగా కలిసి మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు ఆమె ఎందుకు లేఖ వ్రాయాల్సి వచ్చింది? ఆమెను కేసీఆర్‌ తన ఇంటికి రానీయడం లేదా? తండ్రీ కూతుర్ల మద్య కూడా విభేధాలున్నాయా? 

• ఆమె కేసీఆర్‌కి లేఖ వ్రాస్తే అది బయటకు ఎలా లీక్ అయ్యింది? పార్టీలో తనని సైడ్ చేస్తున్నారని అందరి దృష్టిని ఆకర్షించడానికే ఆమె ఆ లేఖ వ్రాసి దానిని మీడియాకు లీక్ చేశారా? 

• ఆ లేఖ గురించి రెండు రోజులుగా రాష్ట్రంలో చర్చ జరుగుతున్నా దానిపై ఆమె లేదా బిఆర్ఎస్ పార్టీలో ఎవరూ స్పందించడం లేదు. ఎందువల్ల? పార్టీ పరిస్థితి బాగోలేదు కనుక అందరూ కలిసి ఈవిదంగా కొత్త డ్రామా ఆడుతున్నారా? 

• రాష్ట్రంలో బీజేపి బలపడుతునప్పుడల్లా, కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీలు కలిసి మా పార్టీని సైడ్ చేయడానికి ఇటువంటి డ్రామాలు ఆడుతూనే ఉన్నాయి. వాటిలో భాగమే ఈ లేఖ అని భావిస్తున్నాను,” అని అన్నారు.


Related Post