జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ మాజీ సిఎం కేసీఆర్‌కి నోటీస్ ఇవ్వడంపై ఆ పార్టీ నేతలు వెంటనే స్పందించి ఖండిస్తున్నారు. కేసీఆర్, హరీష్ రావులతో పాటు మాజీ ఆర్ధిక మంత్రి, ప్రస్తుతం బీజేపి ఎంపీ ఈటల రాజేందర్‌కి కూడా జూన్ 9న విచారణకు హాజరు కావాలంటూ కమీషన్ నోటీస్ ఇచ్చింది. కానీ తెలంగాణ బీజేపిలో ఏ ఒక్కరూ ఆయనకు నోటీస్ ఇవ్వడంపై ఇంతవరకు స్పందించలేదు. ఇది వారి మద్య ఐఖ్యత లేదని సూచిస్తోంది.
తెలంగాణ బీజేపిలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్‌లు ఎవరికి వారే అన్నట్లున్నారు. ప్రధాని మోడీ లేదా అమిత్ షా లేదా ఢిల్లీ నుంచి బీజేపి పెద్దలు ఎవరైనా వచ్చినప్పుడు మాత్రమే తెలంగాణ బీజేపి నేతలందరూ ఒక్క వేదికపై కనిపిస్తుంటారు. మిగిలిన సమయంలో ఎవరి దారి వారిదే!
ఈటల రాజేందర్ కూడా రాష్ట్ర నేతలతో నాకు పనేమిటి? ఏదైనా అవసరమైతే నేరుగా ఢిల్లీ పెద్దలతోనే మాట్లాడుకుంటానన్నట్లు వ్యవహరిస్తున్నారు. కనుక ఈ విషయంలో కూడా యన ఢిల్లీ పెద్దలతో మాట్లాడుకొని కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారేమో?
కానీ పార్టీ నేతల మద్య ఐక్యత, సత్సంబంధాలు లేనప్పుడు తెలంగాణలో బీజేపి అధికారంలోకి రాగలదని ఏవిదంగా అనుకుంటున్నారో?