జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ మాజీ సిఎం, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కి నోటీస్ ఇవ్వడంపై ఆ పార్టీ నేతలు మండి పడుతున్నారు. ముందుగా ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందిస్తూ, “తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన ప్రజా నాయకుడు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ దురుదేశ్యంతో ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమీషన్ కేసీఆర్‌కి నోటీస్ ఇవ్వడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది కాళేశ్వరం కమీషన్ కాదు కాంగ్రెస్ కమీషన్..” అంటూ నిప్పులు చెరిగారు.
ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన ప్రజానాయకుడు కేసీఆర్ గారికి రాజకీయ దురుద్దేశంతో, కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
అది కాళేశ్వరం కమిషన్ కాదు... కాంగ్రెస్ కమిషన్ అని మరోసారి…
బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి కూడా “ఇది కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట.. ఏం నేరం చేశారని కేసీఆర్‌ని వేధిస్తున్నారు? అంటూ ట్వీట్ చేశారు.
కేసీఆర్‌తో పాటు పార్టీలో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావుకి కూడా జూన్ 7న విచారణకు హాజరు కావాలంటూ కమీషన్ నోటీస్ ఇచ్చింది. కానీ కల్వకుంట్ల కవిత, జీవన్ రెడ్డి ఇద్దరూ ఖండించక పోవడం గమనార్హం. ఇది ఆ పార్టీలో వారి మద్య అంతర్గత విభేధాలను సూచిస్తున్నట్లుంది.
కేసీఆర్‌కి నోటీసులు ఇవ్వడమే మహా నేరం, రాజకీయ కక్ష సాధింపుకి పరాకాష్ట అని కల్వకుంట్ల కవిత, జీవన్ రెడ్డి తేల్చి చెప్పేశారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన మూడేళ్ళకే మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు క్రుంగిపోవడం, అన్నారం, సుందిళ్ళ బ్యారేజి గోడలు దెబ్బ తినడం వాస్తవం. కాదనుకుంటే, కేసీఆర్, హరీష్ రావు ఇద్దరూ విచారణకు హాజరయ్యి కాదని నిరూపించుకునే అవకాశం ఉంది. నోటీస్ ఇవ్వడమే కక్ష సాధింపుకి పరాకాష్ఠ కానే కాదు. రేపు తెలంగాణ ప్రభుత్వం వారిరువురిపై కేసులు నమోదు చేసి, చర్యలు చేపడితే అప్పుడు బిఆర్ఎస్ పార్టీ ‘పరాకాష్ట’ అని వాదించినా అర్దం ఉంటుంది.