భారత్ ఆపరేషన్ సింధూర్ నిలిపివేయడంతో పాక్ పాలకులు ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు. భారత్ వారికి ఆ అవకాశం ఎందుకు ఇచ్చిందో తెలియదు కానీ పాక్ మళ్ళీ తన వక్ర బుద్ధి బయటపెట్టుకుంది.
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్-పాక్ శాంతి చర్చల గురించి మాట్లాడుతూ, “భారత్‌తో శాంతి చర్చలకు మేము సిద్దమే కానీ చిరకాలంగా అపరిష్కృతంగా ఉన్న కశ్మీర్ సమస్యపై చర్చించడానికి భారత్ అంగీకరించాలి. లేకుంటే శాంతి చర్చలు సాధ్యం కావు,” అని భారత్‌కు షరతు విధించారు.
భారత్ దాడులను ఎదుర్కోలేకపోయిన పాక్ తమ ప్రజలు, ప్రపంచ దేశాల ముందు సిగ్గుతో తల దించుకోవలసి వచ్చింది. కానీ మళ్ళీ తెరుకోగానే ‘కశ్మీర్ సమస్య’ గురించి మాట్లాడుతూ అందరి దృష్టిని తమ అసమర్ధత, వైఫ్యల్యాలపై మళ్ళించేందుకు ప్రయత్నిస్తున్నట్లు భావించవచ్చు.
పాక్ కోరుకుంటే భారత్ శాంతి చర్చలకు సిద్దపడుతుందా?భారత్‌కు పాక్ షరతులు విధించే పరిస్థితిలో ఉందా?అంటే కాదని అందరికీ తెలుసు. అయినా పాక్ పాలకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం, ఉత్తర కుమార ప్రగల్భాలు పలకడం మానుకోవడం లేదు.