అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ శనివారం సాయంత్రం సోషల్ మీడియాలో ఓ మెసేజ్ పెట్టారు. తాను భారత్-పాక్ ఇరుదేశాల ప్రధానుతో మాట్లాడి, కాల్పులు విరమణకు ఒప్పించానని, ఇరు దేశాలు డీజీఎంఓలు ఈ నెల 12న మద్యాహ్నం 12 గంటలకు సమావేశమై చర్చించుకొని సమస్యలని శాంతియుతంగా పరిష్కరించుకుంటారని, ఇరుదేశాలు విజ్ఞత ప్రదర్శించి తెలివిగా వ్యవహరించినందుకు అభినందిస్తున్నానని ట్రంప్ దానిలో పేర్కొన్నారు.
భారత్ విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ‘శనివారం మద్యాహ్నం సుమారు 3.30 గంటలకు ఇస్లామాబాద్ నుంచి తమకు ఫోన్ వచ్చిందని, కాల్పులు విరమణకు అంగీకరిస్తున్నామని తెలియజేశారని, కనుక భారత్ కూడా తక్షణం కాల్పులు విరమణ చేసిందని తెలిపారు. ఈ మేరకు త్రివిధ దళాలను ఆదేశించామని సాయంత్రం 5 గంటల నుంచి కాల్పులు నిలిపివేశామని ప్రకటించారు.
కానీ పాక్ మళ్ళీ శనివారం రాత్రి 10 గంటల నుంచి జమ్ము కశ్మీర్‌లో పలు ప్రాంతాలపై డ్రోన్ దాడులు చేసింది. అప్రమత్తంగా ఉన్న భారత్ దళాలు వాటిని వెంటనే ధ్వంసం చేశాయి. ఈరోజు తెల్లవారుజాము వరకు జమ్ము కశ్మీర్‌లో బాంబుల మోత మ్రోగుతూనే ఉంది.
పాక్ కాల్పుల విరమణకు పాల్పడి భారత్‌పై దాడులు చేస్తోందని, భారత్ దళాలు వాటిని తిప్పికొడుతున్నాయని విక్రమ్ మిస్త్రీ శనివారం రాత్రి 11 గంటలకు మీడియాకు తెలిపారు.
కుక్క తోక వంకరని, పాక్ వంకర బుద్ధిని ఎన్నటికీ ఎవరూ సరిచేయలేరనే విషయం ఇప్పుడు డోనాల్డ్ ట్రంప్‌కి కూడా అర్దమయ్యే ఉంటుంది.