పాకిస్థాన్‌కు ఒక బిలియన్ డాలర్లు రుణం మంజూరు!

May 10, 2025


img

అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) పాకిస్థాన్‌కు ఒక బిలియన్ అమెరికన్ డాలర్లు రుణం మంజూరు చేసింది.

ఐఎంఎఫ్ అందిస్తున్న ఈ నిధులను పాకిస్థాన్‌ భారత్‌పై యుద్ధానికి, భారత్‌లో ఉగ్రదాడులకు, పాక్‌లో ఉగ్రవాదుల శిక్షణ, ఆయుధాల కొనుగోలుకి ఉపయోగిస్తుందని భారత్‌ అభ్యంతరాలని ఐఎంఎఫ్ పట్టించుకోకపోగా తక్షణం ఈ నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది.

గతంలో తమ అభ్యంతరాలను ఐఎంఎఫ్ పట్టించుకోకపోయినా భారత్‌ సరిపుచ్చుకుంది. కానీ భారత్‌-పాక్‌ మద్య యుద్ధం జరుగుతున్న ఈ సమయంలో ఐఎంఎఫ్ ఇంత ఉదారంగా పాకిస్థాన్‌కి ఆర్ధిక సాయం చేయడాన్ని భారత్‌ తీవ్రంగా తప్పు పడుతోంది. 

జమ్ము కశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సైతం ఐఎంఎఫ్‌ని తప్పు పడుతూ, “పాకిస్థాన్‌కు భారీగా ఆర్ధిక సాయం చేస్తే ఉపఖండంలో ఉద్రిక్తలు తగ్గుతాయని ప్రపంచదేశాలు భావిస్తున్నాయా?ఓ పక్క పాకిస్థాన్‌ భారత్‌లో పలు ప్రాంతాలపై దాడులు చేస్తుంటే, ఐఎంఎఫ్‌ పాకిస్థాన్‌కు నిధులు అందించడాన్ని ఏమనుకోవాలి?” అని ట్వీట్ చేశారు.


Related Post