భారత్ ఆంక్షలతో పాక్ ఇప్పటికే అనేక సమస్యలలో చిక్కుకొని సతమతమవుతోంది. భారత్ విమానాలకు పాక్ గగనతలం మూసివేయడంతో ఇప్పుడు భారత్ నుంచి అమెరికా, యూరప్ దేశాలకు రాకపోకలు సాగించే విమానాలు చుట్టూ తిరిగి వెళుతున్నాయి.
ఇతర దేశాల విమానాలకు పాక్ ఎటువంటి ఆంక్షలు విధించకపోయినా, ఆపరేషన్ సింధూర్ దెబ్బకు దాదాపు అన్ని దేశాల విమానాయన సంస్థలు పాక్ గగనతలంలో ప్రవేశించకుండా చుట్టూ తిరిగి వెళుతున్నాయి!
భారత్-పాక్ మద్య యుద్ధం మొదలైతే తమ విమానాలకు, ప్రయాణికులకు ప్రమాదమని భావించి ముందు జాగ్రత్త చర్యగా చుట్టూ తిరిగి వెళుతున్నాయి.
కనుక అవి భారత్ గగనతలంలో కూడా ప్రవేశించకుండా చుట్టూ తిరిగివెళ్ళాల్సి ఉండగా, అన్ని విమానాలు భారత్ మీదుగానే రాకపోకలు సాగిస్తుండటంతో అనూహ్యంగా భారత్ గగనతలం విదేశీ విమానాలతో నిండిపోయింది.
వందలాది విమానాలు భారత్ గగనతలం మీదుగా రాకపోకలు సాగిస్తుండగా, పాక్ గగనతలంలో ఒక్క విదేశీ విమానం కూడా ప్రవేశించకపోవడం గమనిస్తే, పాక్‌తో పోలిస్తే భారత్ మీదుగా ప్రయాణించడం సురక్షితమని ప్రపంచదేశాల విమానాయన సంస్థలు భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్ సైట్‌లో భారత్-పాక్ గగనతలం.. ప్రపంచదేశాల విమానాల ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.