సిఎం రేవంత్ రెడ్డి మళ్ళీ ఢిల్లీకి..

May 02, 2025


img

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఉదయం ఢిల్లీ బయలుదేరారు. ఈరోజు సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు అందరూ పాల్గొనవలసిందిగా పిలుపు రావడంతో దానిలో పాల్గొనేందుకు సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. 

మోడీ ప్రభుత్వం పాకిస్థాన్‌పై చర్యలకు సిద్దమవుతున్నట్లు స్పష్టం చేసినందున ఆ అంశంపై నేటి సమావేశంలో చర్చించనున్నారు. అలాగే జనాభా లెక్కలతో పాటు కుల గణన జరిపించబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై చర్చించనున్నారు. దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపబోయే ఈ రెండు అంశాలపై కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏవిధంగా ఉండాలనేది ఈ సమావేశంలో చర్చించి, ముఖ్యమంత్రులు పార్టీ సీనియర్ నేతల అభిప్రాయాలు కాంగ్రెస్‌ అధిష్టానం తీసుకుంటుంది. 

ఈ సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొంటారు. సిఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి దామోదర రాజనర్సింహ, సీనియర్ నేత వంశీ చంద్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. 


Related Post