జమ్ము కశ్మీర్‌లో పర్యాటకులను పాక్ ప్రేరిత ఉగ్రవాదులు తుపాకులతో కాల్చి చంపడాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఇప్పటికే పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా పలుచర్యలు చేపట్టింది.
మంగళవారం ప్రధాని నివాసంలో రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (త్రివిధ దళాధిపతి) అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోబల్, త్రివిధ దళాధిపతులు, కొందరు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు.
సుమారు గంటన్నరపాటు సాగిన ఆ సమావేశంలో “ఉగ్రవాదాన్ని ఉక్కు పాదంతో అణచివేసేందుకు భారత్ సైనిక దళాలకు పూర్తి స్వేచ్చనిస్తున్నాము. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నవారికి ఎప్పుడు బుద్ధి చెప్పాలో టైమ్, డేట్ వారే నిర్ణయిస్తారు,” అని అన్నారు.
కనుక పాకిస్థాన్ లేదా పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై భారత్ దాడి చేయబోవడం ఖాయమనే భావించవచ్చు. అయితే త్రివిధ దళాలు రంగంలో దిగి పూర్తిస్థాయిలో దాడి చేస్తాయా లేక ఇది వరకులా సర్జికల్ స్ట్రైక్‌తో సరిపెడతాయా? అనేది ‘పని’ మొదలుపెట్టిన తర్వాతే తెలుస్తుంది.