ఈ నెల 27న హనుమకొండలో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరుగబోతోంది. దాని సన్నాహక సమావేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాయలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాట్లాడుతూ, “కాంగ్రెస్ నేతలు మనల్ని ఫోన్లు చేసి బెదిరిస్తుంటే ఎవరూ భయపడొద్దు. అందరూ ధైర్యంగా వారిని ఎదుర్కోండి. కేసీఆర్ సార్ చాలా మంచోడు కానీ నేను కాస్త రౌడీ టైపే. కనుక ‘పింక్ బుక్’ పెట్టి మనల్ని వేధిస్తున్నవారి పేర్లన్నీ నోట్ చేసుకుంటాను. మళ్ళీ మనం అధికారంలోకి రాగానే బరాబర్ వాళ్ళందరిపై చర్యలు తీసుకుందాము,” అని అన్నారు.
ముఖ్యమంత్రులుగా చేసిన కేసీఆర్, జగన్ ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా, ప్రతిపక్షాలను ఉక్కుపాదంతో అణచివేసి తమ అధికారానికి ఎదురులేకుండా చేసుకోవాలనుకున్నారు. అందువల్లే ‘రెడ్‌బుక్’ పుట్టింది.
నిజానికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ అనేక సమస్యలతో సతమతమవుతోంది. కనుక బిఆర్ఎస్ పార్టీ గురించి ఆలోచించే తీరికే సిఎం రేవంత్ రెడ్డికి మంత్రులకు లేదు. కానీ కేటీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కవిత ముగ్గురూ సిఎం రేవంత్ రెడ్డిని, మంత్రులని కించపరిచే విదంగా మాట్లాడుతూ రెచ్చగొడుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
అయినా ఇంత వరకు బిఆర్ఎస్ పార్టీలో ఏ ఒక్కరిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు, కేసులు నమోదు చేయనేలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం తమని ఏమీ చేయకపోయినా ఏదో చేస్తోందన్నట్లు విమర్శించడం, ‘పింక్ బుక్’ పేరుతో కల్వకుంట్ల కవిత మాట్లాడిన మాటలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలని కవ్విస్తున్నట్లే కదా. సిఎం రేవంత్ రెడ్డి సహనం నశిస్తే నష్టం ఎవరికి?
కేసీఆర్ సార్ మంచోడు కావొచ్చు !
నేను కొంచెం రౌడీ టైప్..
పింక్ బుక్ బరాబర్ పెడతాం..
అందులో పేర్లు రాస్తాం..
-కవిత pic.twitter.com/9LEi88quYw